ఇది ఒక యదార్థ గాధ. ఫామిలీ కోర్టులు సిఫారసు చేసిన కౌన్సిలింగ్ సెంటర్లలో మగవారిని ఎలా ట్రీట్ చేస్తారో తెలియచెప్పే సంఘఠన. 498A చట్టము బెదిరించడానికి వేధించడానికి ఎలా ఉపయోగించు కుంటారో తెలియ జేసే ఘఠన ఇది. సమాజంలో మగవారిని ATM మెషిన్లలాగా చూసే ధోరణికి అద్దంపట్టే సంఘఠన ఇది.
___________________________________________
498A భార్యతో కౌన్సిలరు : చెప్పమ్మా! నీకేం కావాలి.
498A భార్య : నాకు విడాకులు కావాలి.
బాధిత భర్తతో కౌన్సిలరు : ఆమెకు విడాకులు ఇవ్వడానికి సిద్దమేనా లేక కలిసి ఉండాలనుకుంటున్నారా?
బాధిత భర్త : నామీద 498A కేసు ఉన్నంత వరకూ నేను విడాకుల గురించి కానీ, తిరిగి కలిసి జీవించడం గురించి కానీ ఆలోచించలేను.
బాధిత భర్తతో కౌన్సిలరు : ఎందుకు చేయలేరు? ఆవిడ విడాకులు కావాలని అడుగుతోంది గదా? జస్ట్ విడాకులు ఇచ్చేయండి. ఆమె జీవితాన్ని ఆమెను గడపనివ్వండి, మీ జీవితాన్ని మీరు చూసుకోండి. ఆవిడ ఇన్నిరోజులు బాదలు పడుతూ వచ్చింది. ఆవిడని సరిగా చూడలేదని, మీరు ఆమెనుండి ఆశించేవి ఆమోదయోగ్యంగా లేవని చెబుతోంది.
బాధిత భర్త : సర్, ఆమెనుండి నేను అమోదయోగ్యం కాని వేవీ నేను ఆశించలేదు. నేను కేవలం, ఒక సహధర్మచారిగా, సమాన హోదాతో, గౌరభావంతో అమెతో జీవించాలని మాత్రమే అనుకున్నాను.
బాధిత భర్తతో కౌన్సిలరు : మీ భార్య మీతో సమాన హోదాలో ఎలావుంటుంది. నాకు తెలిసినంతవరకూ భార్య గురించి చెబుతాను విను, ఉదయాన్నే లేవగానే, నాకు కొన్ని అవసరాలుంటాయి. టూత్‌పేస్ట్, బ్రష్, కాఫీ, పేపరు, వేడినీల్లు, బట్టలు మరియు టిఫిను ఇలాంటీ అవసరాలు, ఇహ మధ్యాహ్నం.. ఆవిద ఫోను చేస్తే, " ఎలావున్నావని అడగడం, సాయంత్రం ఇంటికి రాగానే నాకు మల్లి ఆహారం కావాలి, ఇంకా చాలా అవసరాలుంటాయి. మీరు అన్-రీజనబుల్ అని చెప్పడానికి ఇవి చాలవా? ప్రస్తుతం సంభవించిన సంఘఠనల దృష్ట్యా మీరు ఆవిడతో కలిసివుండడం కష్టం అని మీరు ఆమెకు ఉత్తరం రాసారా లేదా?
బాధిత భర్త : అవును సర్, నేను రాశాను.
బాధిత భర్తతో కౌన్సిలరు : ఇంకేం, ఇది ఆవిడ పట్ల హింసే. అదిచాలు ఆవిడకు నీ మీద 498A కేసు పెట్టడానికి.
బాధిత భర్త : సర్, ఆమె చెప్పింది మీరు చాలా విన్నారు. మీరు ఆవిడ ఫిర్యాదును ఒక్కసారి చదవండి. నా పరిస్థితి ఏమిటో మీకు అర్థం అవుతుంది. నిజానికి ఆవిడ చేత, ఆవిడ బంధువుల చేత బాధలు పడింది నేను.
బాధిత భర్తతో కౌన్సిలరు : నో, నేను చదవను. పస్తుతం నీకేం కావాలి అన్నది తప్ప నేను మరేదీ పట్టించుకోదలుచుకోలేదు. మీరు ఆమెకు విడాకులు ఇస్తారా? లేదా?
బాధిత భర్త : సర్, ఇది అన్యాయం ఇప్పటివరకూ జరిగిన దానిపై నావాదనను ఎవ్వరూ వినలేదు. రెండు సంవత్సరాలుగా నేను 498A దిర్విని యోగాన్ని ఎదుర్కొంటున్నాను. బెయిలు షరతు మీద నా పాస్ పోర్టును కూడా స్వాధీనం చేసుకున్నారు. విదేశంలో నాకు వున్న ఉద్యోగం కూడా పోయింది. నా వీసా స్టేటస్ కూడా నేను కోల్పోయాను. నేను అప్పటి నుండి ఇప్పటి వరకూ నిరుద్యోగిగా ఉండాల్సి వచ్చింది.
బాధిత భర్తతో కౌన్సిలరు : అదంతా ప్రస్తుతం అనవసరం. అదంతా వదిలేయండి. 498Aని కూడా వదిలేయండి. పరస్పరాంగీకారంతో తీసుకొనే విడాకులకు మీరు అంగీకరిస్తే 498Aను తొలగిస్తాం.
బాధిత భర్త : కాని సర్, నాకు తెలిసిన చాలా మంది మగాళ్ళు, విడాకులు బలవంతంగా ఇచ్చిన తరువాతకూడా, క్రిమినల్ కేసులను ఎదుర్కొంటు తమ జీవితాన్ని వెల్లదీస్తున్నారు.
బాధిత భర్తతో కౌన్సిలరు : వాటన్నింటి గురించి మీరు ఆందోళన పడకండి. మీరు విడాకులు ఇవ్వడానికి అంగీకరిస్తే, మీమీద 498A కేసును తీసివేస్తాం.
బాధిత భర్త : సర్, ఏ తప్పు చేయక పోయినప్పటికీ, సమాజంలో నేను ఒక నేరస్తుడిగా చిత్రించ బడ్డాను. నేను నా కేసు పోరాడి, నా నిర్ధోషిత్వాన్ని నిరూపించుకో దలుచుకున్నాను.
బాధిత భర్తతో కౌన్సిలరు : చూడు, 498A పెద్ద విషయం కాదు. కానీ, నువ్వు పోరాడితే కొన్ని సంవత్సరాలు పడుతుంది. దాని బదులు, విడాకులు ఇచ్చేయ్, 498A నుండి విముక్తుడివికా! ఇవన్నీ కోర్టు బయట పరిష్కరించుకోవడమే ఉత్తమం. అంతే కాకుండా, నాకున్న వ్యక్తిగత విలువలనుసారం, హిందూ సమాజం యొక్క విలువలకు కట్టుబడి, నీ భార్యను చక్కగా చూసుకోవాల్సిన భాధ్యత నీ మీదవున్నదని నేను భావిస్తున్నాను. నీకు ఇవ్వగల స్తోమతుంది కాబట్టి, నీ భార్యకు నీవు భరణం కూడా ఇవ్వాలని నేను భావిస్తున్నాను.
బాధిత భర్త : కానీ సర్, పెళ్ళయిన నాటి నుండి, ఆవిడ ద్వారా, ఆవిడ బందువుల ద్వారా హింసలకు గురయింది నేను. విడాకులకు దరఖాస్తు చేసుకుంది కూడా తనే. ఉద్యోగాన్ని కోల్పోయింది నేను, అంతే కాకుండా తప్పుడు 498A కేసును ఎదుర్కొంటుంది కూడా నేనే.
బాధిత భర్తతో కౌన్సిలరు : వాటన్నింటి గురించి నువ్వు అనవసరంగా బాధపడకు. 498A అంత తీవ్రమైంది కాదు.
బాధిత భర్త : కానీ సర్, అది నా పట్ల చాలా తీవ్రంగా వుంది. మా నాన్నగారు చావు బతుకుల మధ్య వున్నప్పుడు తను నాపై కేసు వేసింది. మా నాన్నగారి చివరిచూపులకు కూడా నేను నోచుకోలేకపోయాను. ఆయన అంత్యక్రియలకు కూదా నేను హాజరవ్వలేకపోయాను.
బాధిత భర్తతో కౌన్సిలరు : చూడు, నువ్వు వీటన్నింటినీ వదిలెయ్.
498A భార్యతో కౌన్సిలరు : మీతో పాటు మీ కుటుంభ సభ్యులు ఎవరైనా వచ్చారా?
498A భార్య : యస్ సర్, నా చెల్లెలు, మిగిలిన వారుకూడా వచ్చారు.
498A భార్యతో కౌన్సిలరు : మీ చెల్లెలిని లోపలికి రమ్మను, మరో సార్ కలిసినప్పుడు ఏమి చేయాలో ఆవిడకు నేను వివరిస్తాను.
బాదిత భర్త : సర్, నా చెల్లెలు కూడా ఇక్కడే వుంది. ఆమెను కూడా లోనికి వచ్చి విననివ్వండి.
బాధిత భర్తతో కౌన్సిలరు : అవసరంలేదు.
బాదిత భర్త : కానీ సర్, ఆమె నా కుటుంభ సభ్యురాలు.
బాధిత భర్తతో కౌన్సిలరు : అవసరంలేదు. ఏది ఏమయినప్పటికీ, చివరికి నిర్ణయం తీసుకోవలసింది నువ్వు.
498A భార్య చెల్లెలితో కౌన్సిలరు : మీరు 498A కేసును వాపసు తీసుకుంటే ఇతను విడాకులు ఇస్తాడు. కాబట్టి ఈసారి వచ్చినప్పుడు, పరస్పరాంగీకార విడాకులకు మీమీ అభ్యర్థనలతో రండి. మల్లీ మనం వారం రోజులలో కలుద్దాం.
_________________________________________________
నేను రాసిన
"మగాల్లూ ... ఇల్లుకొనడం మానండి" అన్న టపాలోని ఒకవ్యాఖ్యలో, కౌన్సిలింగు గురించి అడగడం జరిగింది. దానికోసమే ఈ టపా. నేను ఈ టపాని చల్లా ఉమగారి
" Fight for Gender Equality" అన్న బ్లాగులోని
"A Day at State Legal Services" అన్న టపాను అనువాదం చేస్తూ రాయడం జరిగింది. దాని స్పూర్తికి విఘాతం కలగకుండా నా ప్రయత్నం నేను చేసాను.